బాబ్బాబు.. టీమిండియా కోచ్ గా చేయి ప్లీజ్..

భారత జట్టు 2011 ప్రపంచ వన్డే కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన కోచ్ గ్యారీ కిర్ స్టెన్ మళ్లీ కోచ్ గా బాధ్యతలు చేపట్టాలంటూ బీసీసీఐ లేఖలు రాసిందట.. ప్రస్తుతం ఇండియా వరుస ఓటములతో దిక్కుతోచని స్థితిలో ఉంది. మాజీ కోచ్ ఫ్లెచర్ పదవీకాలం ముగిసిపోయింది. దీంతో టీమిండియా డైరెక్టర్ గా రవిశాస్త్రి కొనసాగుతున్నారు. ఆయన తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టారు. జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించడం లేదు..

దీంతో బీసీసీఐ మళ్లీ భారత క్రికెట్ ను ప్రపంచ నంబర్ 1 ర్యాంకు కు చేర్చిన గ్యారీ కిర్ స్టెన్ ను కోరింది. కానీ గ్యారీ కోచ్ గా రావడానికి నిరాకరించారు. తాను క్రికెట్ కు దూరంగా ఉంటున్నానని.. కుటుంబంతో గడపడానికి తన ప్రాధాన్యం అని తెలిపారు. ఐపీఎల్ లో ఢిల్లీ కోచ్ గా ఉన్నప్పుడే టిమిండియా కోచ్ గా రావాలని కోరారని.. కానీ ఇప్పట్లో కుటుంబానికే తన ప్రాధాన్యం అన్నారు. ఇప్పటికే జీవితం కోల్పోయానని కుటుంబంతో గడుపుతానన్నారు. కోచ్ పదవులు చేపట్టనన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *