బాబ్బాబు.. కాంగ్రెస్ నుంచి పోటీచేయండి..

వరంగల్ : వరంగల్ ఉప ఎన్నిక కాంగ్రెస్ కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. కాంగ్రెస్ నుంచి వరంగల్ లో పోటీ చేయడానికి అభ్యర్థి కరువైన పరిస్థితి నెలకొంది. టీఆర్ఎస్ వ్యూహాల దెబ్బకు వివేక్ ను ఢిల్ల పిలిపించి పోటీచేయాలని కాంగ్రెస్ అధిష్టానం కోరింది. కానీ వివేక్ తాను పెద్దపల్లి నియోజకవర్గాన్ని వీడనని స్పష్టం చేశారు. దీంతో బలహీనమైన రాజయ్య, విజయరమారావు, రాజారపు ప్రతాప్ అభ్యర్థులను టీఆర్ఎస్ కు పోటీగా నిలిపితే ఓడిపోతామని కాంగ్రెస్ భావిస్తోంది..

కాగా టీఆర్ఎస్ తరఫున పోటీకి పలువురు కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, టీఆర్ఎస్ నాయకులు ఎర్రోల్ల శ్రీనివాస్ ల పేర్లు వినపడుతున్నాయి. నిన్న సమీక్షించిన కేసీఆర్ అభ్యర్థిని ఖరారు చేశారు. ఈరోజు ప్రకటించే అవకాశం ఉంది.. వరంగల్ లో ఎన్నికలు జరిగే ప్రతీ నియోజకవర్గానికి ఒకరి చొప్పున మంత్రులకు బాధ్యతలు అప్పగించారు కేసీఆర్..

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *