బాబే టార్గెట్ గా వైసీపీ, టీఆర్ఎస్ మైండ్ గేమ్

మంగళగిరి : ‘ఓటుకు నోటు కేసులో అసలు సూత్రధారి చంద్రబాబును అష్టదిగ్బంధనం చేసేందుకు వైసీపీ, టీఆర్ఎస్ పక్కా ప్రణాళిక రూపొందిస్తోంది. రేవంత్ రెడ్డి అరెస్ట్ అవడం నుంచి పక్కా ప్రణాళిక వ్యూహరచనతో టీఆర్ఎస్ ప్రభుత్వం చంద్రబాబును ఇరికించేందుకు ముందుకెళ్తోంది. వైసీపీ అధినేత జగన్ తో పురమాయించి ఒత్తిడి తెచ్చేందుకు దీక్షలు చేయిస్తోంది. అలాగే ఏసీబీతో పక్కాగా చార్జిషీట్ దాఖలు చేయిస్తోంది.. దీంతో పాటు టీఆర్ఎస్ మంత్రులతో చంద్రబాబే దోషి అంటూ ప్రకటనలు చేయిస్తోంది..

ఈ పరిణామాలపై కలత చెంది చంద్రబాబు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. జగన్ మంగళగిరిలో సమరదీక్ష చేయడంతో చంద్రబాబు సైతం జిల్లాల్లో సభలు నిర్వహిస్తూ తాను కడిగిన ముత్యం అని ప్రకటిస్తున్నారు. కానీ జనంలో వీడియోలతో దొరికిపోవడం చంద్రబాబు కథ కంచికి చేరేలానే కనపడుతోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *