
సీఎం కేసీఆర్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం బహిరంగ సభలో చంద్రబాబు టార్గెట్ గా విమర్శలు గుప్పించారు.. శనివారం రాత్రి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్.. టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు..
మా వదిన భువనేశ్వరీ హైదరాబాద్ లోని హెరిటేజ్ దుకాణాలును వ్యాపారాలను బాగానే నిర్వహిస్తున్నారని.. నువ్వు ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేసుకుంటే చాలు.. హైదరాబాద్ ను మేం అభివృద్ధి చేస్తామని ’ కేసీఆర్ చంద్రబాబును ఉద్దేశించి అన్నారు.
చంద్రబాబు ఆయన భార్య భవనేశ్వరిపై కేసీఆర్ చలోక్తులకు జనం చప్పట్లో హర్షం వ్యక్తం చేశారు.. మాటల మరాఠి కేసీఆర్ అంటూ పొగిడారు..