Breaking News

బాబు సమక్షంలో కేసీఆర్-రాధాకృష్ణ రాజీ.?

abn

వారిద్దరు ఉప్పు-నిప్పులా ఉన్నారు. తెలంగాణ ఏర్పడ్డప్పటినుంచి ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు.. చివరకు ప్రతిపక్షంకంటే కూడా కేసీఆర్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ను టార్గెట్ చేశారు. తనపై తప్పుడు రాతలు రాసినందుకు తెలంగాణ ఏర్పడిన మొదటి సమావేశంలోనే టీవీ9తో కలిపి ఏబీఎన్ చానల్ ను మూసివేయించాడు. దీంతో రాధాకృష్ణ రెచ్చిపోయి కేసీఆర్ విరుచుకుపడేలా దొరికిన ప్రతీసారి ప్రచండ వార్తలతో కేసీఆర్ కు చికాకు పుట్టించాడు.. అక్కడకు కట్ చేస్తే..

అయుత చండీయాగానికి ఆహ్వానించేందుకు విజయవాడ వెళ్లిన కేసీఆర్ .. బాబుతో ఏకాంతంగా గంటపాటు చర్చలు జరిపాడట.. ఈ చర్చల్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీని కూడా పాల్గొన్నాడని ఇన్ సైడ్ టాక్.. చంద్రబాబు సీనియర్ కావడంతో ఆయన మాట మీద గౌరవంతో కేసీఆర్, ఏబీఎన్ ఆంద్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ తో రాజీ కుదుర్చుకున్నాడని సమాచారం. ఇదంతా చాలా రహస్యంగా జరిగినట్టు సమాచారం.
ఇక వ్యతిరేక వార్తలు వద్దు.. పొగడ్తలే ముద్దు..
అందుకే కేసీఆర్ విజయవాడ పోయిన తర్వాత మరునాడే ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్లో కేసీఆర్ ను పొగుడుతూ ఒక వార్త ప్రచురించారు. గోదావరిపై రివర్స్ లో నీటి మళ్లించేలా కేసీఆర్ అపర భగీరథ ప్రయత్నం చేస్తున్నారని.. తెలంగాణను సస్యశ్యామలం చేసేలా ఈ డిజైన్ ఉందంటూ కేసీఆర్ ను పొగుడుతూ ఆ వార్త ప్రచురించారు.. తెలంగాణ ఏర్పాడ్డాక దాదాపు సంవత్సరంన్నర తరువాత కేసీఆర్ పై పాజిటివ్ వార్త రావడంపై మతలబు ఏంటని ఆరా తీస్తే ఈ రాజీ కుదర్చుకున్నారన్న విషయం వెలుగుచూసింది. అంతేకాదు సీఎం కేసీఆర్ చేస్తున్న చండీయాగానికి సైతం ఆంధ్రజ్యోతి పాజిటివ్ గా వార్తలు రాయడంతో కేసీఆర్*రాధాకృష్ణ ల రాజీ కుదుర్చుకున్నారనే విషయం తేటతెల్లం అయ్యింది.. దీంతో ఇక ఆంధ్రజ్యోతిలో కేసీఆర్ పై వ్యతిరేక వార్తలుండవు.. అన్నీ పొగుడుతూ రాసే వార్తలే.. ఇక కేసీఆర్ కు తెలంగాణలో ఎదురులేనట్టే..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *