
ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా జరుగుతున్నాయి.. ఏపీ అసెంబ్లీ సమావేశానికి వైసీపీ సభ్యులు ప్లకార్డులతో వచ్చారు. ఏపీ ప్రత్యేక హోదా.. పుష్కర భక్తుల మృతి, ఏపీకి అన్యాయంపై చర్చ జరపాలని నినదించారు.
కాగా ఏపీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే వైసీపీ అధినేత ప్రతిపక్ష నేత జగన్ చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. బాబు సుబ్బరంగా మేకప్ చేసుకొని షూటు బూటు వేసుకొని దర్శకులతో షూటింగ్ చేయించుకున్నారని.. వీఐపీ ఘాట్ కు పోకుండా సాధారణ ఘాట్ కు పోయి 30 మంది మరణాలకు కారణమయ్యాడని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
చంద్రబాబు ముప్పై మందిని చంపి దెయ్యాలు వేదాలు వల్లించినట్టు మళ్లీ వారికే దండలు వేసి నివాళులర్పించడం ఇంతకన్నా దుర్మార్గం ఉండదన్నారు.