
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 109వ జయంతి ఉత్సవాల వాల్ పోస్టర్ ను తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ ఆదివారం నాడు హైదరాబాద్ లో విడుదల చేశారు.ఈ నెల ఐదవ తేదీన ఉదయం పది గంటలకు ఎల్బీ స్టేడియం వద్ద గల బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద రాష్ర్ట్ట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 109వ జయంతి ఉత్సవాలను ప్రారంభిస్తారని కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ అభివృద్ధి శాఖ, విద్యుత్, సహకార శాఖ మంత్రి జి. జగదీశ్వర్ రెడ్డి ఆర్గనైజింగ్ కమిటి ఛైర్మన్ బత్తుల రాంప్రసాద్, కో ఛైర్మన్ లు మాదం చంద్రశేఖర్, బి. వెంకటేశ్వర్లు, శ్రీమతి మేరి, నాగారం చిన్నబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈఉత్సవాలకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కొప్పుల ఈశ్వర్ కోరారు.