బాబు చేస్తే నీతి.. మేం చేస్తే అవినీతా..?

చంద్రబాబు అక్రమంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారని.. తాము టీఆర్ఎస్ లో చేరితే తిట్టిన ఆయన ఇప్పుడు ఏ నీతిలో ఇతర పార్టీ నేతలను చేర్చుకున్నారని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ధ్వజమెత్తారు. చంద్రబాబు మాటలు తమను బాధకలిగించాయని.. ఆయన చేస్తే నీతి.. వేరేవాల్లు చేస్తే అవినీతా అని తలసాని బాబును ప్రశ్నించారు.
ఏ ప్రలోభాలకు గురిచేసి టీడీపీలో వైసీపీ వాళ్లను చేర్చుకున్నారో తెలపాలని ప్రశ్నించారు. వాళ్లతో రాజీనామాలు చేయించి దమ్ముంటే గెలిపించాలని డిమాండ్ చేశారు. సింగపూర్, మలేషియా అంటూ ఏపీ ప్రజల చెవుల్లో పూలు పూయిస్తున్నారని ధ్వజమెత్తారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *