బాబు అగ్గిమీద గుగ్గిలం

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులపై సాక్షి పత్రిక ఏపీ ఎడిషన్ లో వేసిన కథనం ఆ రాష్ట్ర సర్కారునే గడగడాలాడిస్తోంది. సాక్షి పత్రిక నిన్న తాటికాయంత అక్షరాలతో 3 మెయిన్ పేజీల్లో చంద్రబాబు రాజధాని భూముల విషయంలో రైతుల నుంచి కొల్లగొట్టిన తీరును ఎండగట్టింది.. బాబు రాజధానిని నూజీవీడు అని మార్చి.. అమరావతికి షిఫ్ట్ చేసిన తీరు.. రైతుల నుంచి ముందస్తుగా వేల కోట్ల విలువైన భూములను లక్షల్లో కొనుగోలు చేయడంపై అదిరిపోయే వార్త ప్రచురించింది.

ఇప్పుడు ఈ వార్త ప్రకంపనలు మంత్రులను మొదట.. ఈరోజు చంద్రబాబును తాకాయి.. తాము రాజధాని భూముల విషయంలో అవినీతికి పాల్పడలేదని.. ఎంతో ముందుచూపుతో చేస్తే అవినీతి సొమ్ముతో పెట్టిన సాక్షిలో తమపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మంత్రులు నిన్న సాక్షిపై 100కోట్లకు పరువునష్టం దావా వేస్తామని సైతం ప్రకటించారు. గురువారం రాత్రి చంద్రబాబు సైతం సాక్షిపై మండిపడ్డారు. తీవ్ర చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హెచ్చరించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *