Breaking News

బాబుకు, కేసీఆర్ కు తేడా అదే..

babu kcr

అమెరికాలో దాదాపు 10రోజుల పాటు అంతా సెలవులే.. ఇప్పుడు అక్కడ విద్యాసంస్థలు, పరిశ్రమలు, ఐటీ, ఉద్యోగులకు అందరికీ క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవులే.. అందుకే ఈ పదిరోజులు తన జన్మభూమిలో గడిపేద్దామని వచ్చారు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల.. ప్రపంచాన్నే శాసిస్తున్న కంప్యూటర్ దిగ్గజ సంస్థకు సీఈవో అయిన సత్యనాదెళ్ల కోసం ప్రధాని మోడీ లాంటి వాళ్లే ఎదురుచూస్తారు కానీ మన కేసీఆర్ అయుత చండీయాగం వల్ల ఆయనతో మీట్ కాలేకపోయారు. చండీయాగం పూర్తయినా తుది మొక్కులు మొక్కుకునేందుకు కేసీఆర్ వేములవాడకు వెళ్లారు. దీంతో కేసీఆర్ బదులు ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్ సత్యనాదెళ్ల ను రిసీవ్ చేసుకొని టీ హబ్ లో కార్యక్రమాలు నిర్వహించారు..

కానీ చంద్రబాబు మాత్రం టెక్నాలజీ దిగ్గజం సత్యనాదెళ్లను మంచి చేసుకోవాలని ఏకంగా విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చారు. సత్యనాదెళ్లతో భారీ ఒప్పందాలు చేసుకున్నారు. ఏపీలో అభివృద్దికి భాగస్వామ్యం కల్పించారు. చంద్రబాబు ముందుచూపుతో ఇలా బంగారు కోడిపెట్ట లాంటి సత్యను ఇంటికి ఆహ్వానించి మనవన్ని చేతిలో పెట్టి కోర్కెలు కోరారు.. లబ్ధి పొందారు..

కానీ కేసీఆర్ ఆధ్యాత్మికత భావంతో మునిగితేలుతున్నారు కాబట్టి మంత్రి కేటీఆర్ సత్యతో నాదెళ్లతో టీ హబ్ లో పర్యటింపచేశారు.. మొత్తానికి అందివచ్చిన అవకాశాలను దక్కించుకోవడంలో కేసీఆర్ కంటే బాబు ఒక ఆకు ఎక్కువే చదివారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *