Breaking News

బాపూజీకి నివాళులర్పించిన ఒబామా

rajghat_obama

ఢిల్లీ , ప్రతినిధి : అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మహాత్ముడికి ఘనంగా నివాళులర్పించారు. రాజ్ ఘాట్ కు చేరుకొని అక్కడ  బాపూ సమాధి మీద పుష్పగుచ్ఛం ఉంచి ప్రార్థన చేశారు. అనంతరం సమాధి చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేసి, పూలు సమర్పించారు. ఆయన వెంట కేంద్రమంత్రి పీయుష్ గోయల్ ఉన్నారు. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత సందర్శకుల పుస్తకంలో తన సందేశాన్ని రాశారు. బాపూజీ అంటే ఒబామా ఎనలేని గౌరవం .. చాలా సందర్భాల్లో ఆయన తనకు గాంధీజీనే స్పూర్తి అని కొనియాడారు. అందుకే ఇండియాకు రాగానే గాంధీజీ సమాధిని సందర్శించుకున్నారు.

అనంతరం మహాత్ముడి ఘాట్ లో ఓ రావి మొక్కను నాటారు. అంతకుముందు ఒబామాకు రాష్ట్రపతి భవన్ లో ఘనస్వాగతం లభించింది. గుర్రాలతో సైనికులు ఆయనను రాష్ట్రపతి భవన్ కు తీసుకొచ్చారు.  సైనికవందనం తీసుకున్న అనంతరం ఒబామాకు ప్రధాని, రాష్ట్రపతి కేంద్రమంత్రులు రాజ్ నాథ్, సుష్మ, వెంకయ్య, మనోహర్ పారికర్ లను పరిచయం చేయించారు. అనంతరం నేరుగా రాజ్ ఘాట్ కు వెళ్లారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *