
హైదరాబాద్ : వరంగల్ ఉప ఎన్నికపై మంత్రులు, టీఆర్ఎస్ నాయకులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ ఉప ఎన్నికకు నిలబెట్టే అభ్యర్థి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన పనిలేదని.. మొత్తం ఖర్చంతా పార్టీయే భరిస్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు. అభ్యర్థి అందిరికీ తెలిసిన నిజాయితీ పరుడు అయ్యి ఉండాలని.. పార్లమెంటుకు వెళతాడు కాబట్టి బాగా ఇంగ్లీష్, హిందీల్లో మాట్లాడి పనులు చేయించేవాడు అయ్యి ఉండాలని కేసీఆర్ స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో వరంగల్ నుంచి కాకతీయ ప్రొఫెసర్లు కానీ., విద్యార్థి నాయకుడు ఎర్రోల్ల శ్రీనివాస్ కు గానీ ఛాన్స్ దక్కే అవకాశం ఉంటుందని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. కేసీఆర్ ఇవాళ రాత్రి టీఆర్ఎస్ తరఫున ఎవరిని నిలబెడతారో అభ్యర్థిని ప్రకటించనున్నారు.