‘బహుబలి’ మరో మేకింగ్ వీడియో రిలీజ్

హైదరాబాద్, ప్రతినిధి :   బహుబలి  మరో వీడియో  ప్రేక్షకుల్లో ఆసక్తిని రెట్టింపుచేసింది. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’కి సంబంధించి మరో మేకింగ్ వీడియో సోమవారం బయటకు వచ్చింది. ఈ వీడియోలో హీరో హీరోయిన్లు లేకపోయినా సెట్స్ డిజైన్స్‌ను స్పెషల్‌గా చూపించాడు జక్కన్న. ఇటీవల ముంబైలో జరిగిన ‘కామిక్ కాన్’ ఫెస్టివల్‌లో స్పెషల్‌గా ఈ వీడియో ప్రదర్శించారు.

ఈ కార్యక్రమానికి రానాతోపాటు టీమ్ సభ్యులు హాజరయ్యారు. మంచి స్పందన రావడంతో యూనిట్ ఖుషీగా వుంది. తాజాగా ఇదే వీడియోని సోమవారం రిలీజ్ చేశాడు. మూవీ మేకింగ్, భారీ సెట్స్, విజువల్ ఎఫెక్ట్స్ గురించి ఈ వీడియోలో చూపించాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బల్గేరియాలో జరుగుతోంది. ప్రభాస్- తమన్నాలపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. అన్నీఅనుకున్నట్లుగా జరిగితే జనవరి చివరలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలుకానున్నట్లు తెలుస్తోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.