బహిరంగంగా పొగతాగితే భారీ జరిమానాలు

హైదరాబాద్, ప్రతినిధి : పొగ తాగని వాడు దున్నపోతాడై పోతాడు అన్నాడు గిరీశం మాటలు.. పొగరాయుళ్ల నోట తరుచూ వింటుంటాం.. కానీ పొగతాగితే దూలతీరిపోతదని అంటోంది కేంద్రం. కాదు కూడదంటే… ఫైన్ తో జేబులు కత్తిరిస్తామని తెగేసి చెబుతోంది. స్మోకింగ్ చేసేందుకు ఇప్పుడున్న 18 ఏళ్ల ఏజ్ లిమిట్ ను.. 21 ఏళ్లకు పెంచాలని భావిస్తోంది. సిగరెట్ స్మోకింగ్ పై గతంలో ఉన్న రూల్స్ ను స్ట్రిక్ట్ గా అమలు చేయాలంటున్న సిగరెట్లు పొగాకు ఉత్పత్తుల సవరణ బిల్లును ప్రతిపాదించింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. కొత్త ప్రపోజల్స్ ఓకే అయి.. చట్టం అమల్లోకి వస్తే… ఇకపై పర్మిషన్ లేని ప్రాంతాల్లో సిగరెట్ తాగేవారికి ఫైన్ మొత్తం వెయ్యి రూపాయలవుతుంది. రెస్టారెంట్లు, హోటళ్లలో ఉన్న స్మోకింగ్ జోన్లు మాయమవుతాయి. విడి సిగరెట్లు అమ్మినవారికి 10 వేల ఫైన్ పడుతుంది. చట్టాన్ని ఫాలో కాని వారికి… తీవ్రతను బట్టి పది వేల నుంచి లక్ష రూపాయల వరకు జరిమానా పడే చాన్స్ ఉంది. పరిస్థితిని బట్టి… సిగరెట్ తాగేందుకు పర్మిషన్ ఏజ్ 25 ఏళ్ల వరకు పెంచేందుకు కేంద్రానికి అవకాశం ఉంది.

చట్టం అమలును మానిటర్ చేసేందుకు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన జాతీయ పొగాకు నియంత్రణ సంస్థను కేంద్రం ఏర్పాటు చేయబోతోంది. రూల్స్ ఫాలో కానివారిపై నమోదైన కేసుల విచారణకు.. ప్రత్యేక సెషన్స్ కోర్టులు కూడా ఏర్పాటవుతాయి. వీటన్నిటితో జనాల్లో స్మోకింగ్ అలవాటును తగ్గించొచ్చని కేంద్రం భావిస్తోంది. అన్నీ కుదిరితే… బహిరంగంగా పొగాకు ప్రొడక్ట్స్ అమ్మకాలు నిషేధించాలనీ కేంద్రం భావిస్తోంది. కొత్త ప్రతిపాదలనపై… సలహాలివ్వాలంటూ ప్రజలతోపాటు… పొగాకు ఉత్పత్తి సంస్థలు, రైతులకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రిక్వెస్ట్ చేసింది.

About The Author

Related posts