బస్సులు లేని గ్రామాలకు బస్సులు వేయిస్తాం : మంత్రి మహేందర్ రెడ్డి

ఆన్ లైన్ లో వాహన కాలుష్యం దృవీకణకు చర్యలు

వాహన సామర్థ్యం పరిక్షలు అధికారుల చేతికే

వేగ నియంత్రణకు ప్రాధాన్యం 23 వేల కేసులు నమోదు

ఎం – వాలెట్ @ దేశానికే ఆదర్శం

అన్ని ఆర్టీఏ కార్యాలయాలకు స్వంత భవనాలు

బస్సులు లేని గ్రామాలకు బస్సులు వేయిస్తాం

శాసన సభలో మంత్రి మహేందర్ రెడ్డి

హైదరాబాద్, మార్చి 25 : రాష్ట్రంలో ని వాహన కాలుష్య దృవీకరణ రానున్నరోజుల్లో మద్య వర్తులతో నిమిత్తం లేకుండా ఆన్ లైన్ ద్వారా అందించేఏర్పాటు చేస్తామని రవాణా శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డితెలిపారు. శాసన సభలో ప్రశ్నోత్వరాల సమయంలో సభ్యులు గువ్వలబాలరాజు, అజయ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, చిన్నయ్య, కోమటి రెడ్డి వెంకట్రెడ్డి, జాఫర్ ఉస్సేన్ తదితరులు అడిగిన ప్రశ్నలు, ఉప ప్రశ్నలకు మంత్రివివరణ ఇస్తూ రాష్ట్రంలో రవాణాశాఖ ప్రస్తుతం దృవీకరణ ఏజెన్సీలు ద్వారా అందిస్తున్న కాలుష్య దృవీకణ ప్రతాలను అవినీతికి ఆస్కారం లేకుండా, ప్రైవేటు వ్యక్తులతో ఇబ్బందులు రాకుండా ఆన్ లైన్ లో అందించే ఏర్పాట్లుచేస్తామన్నారు. అలాగే ప్రస్తుతం వాహాన సామర్థ్యం దృవీకరణ విద్యావంతులతో వ్యవస్థీకృతమైన రవాణాశాఖ అధికారులకే అప్పగించే అంశంమీద త్వరలో చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. రోడ్డు భద్రత,ప్రమాదాల నివారణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో మితిమీరిన
వేగంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నందున ప్రమాదాల నివారణకు స్పీడ్గవర్నర్ లను చెక్ పోస్టులు సహా జాతీయ, ఇతర రహాదారులలో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. వేగ నియంత్రణతో పాటు స్టేజీ, కాంట్రాక్ట్ క్యారేజీల నివారణకు సిబ్బంది తనిఖీలు పెంచుతున్నామని ఇలా సుమారు 23 వేల కేసులను నమోదు చేశామన్నారు. ఆర్టీసీతో పాటు ప్రవేటు వాహనాదారులంతా స్పీడ్ గవర్నర్లను ఏర్పాటు చేసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని రవాణా శాఖకు స్వతం భవనాలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు పేర్కోంటూ ఆన్ లైన్ సేవలకు తెలంగాణ రోల్ మాడల్ గా నిలుస్తుందని పేర్కొన్నారు. తెలంగాణలో ని ఎం- వాలెట్ దేశానికే ఆదర్శంగా నిలిచేలా సుమారు 25 లక్షల మందికి నెట్ ద్వారా సెల్ ఫోన్ లో అందు బాటులో ఉందని స్పష్టం చేశారు.రాష్ట్రంలో 2008 ఆగస్టు మాసంలో నామమాత్రంగా ప్రారంభమైన ఆన్ లైన్ సేవలను తమ ప్రభుత్వం 57 సేవలకు
విస్తరించిదన్నారు.2.8.2016 నుండి 3.3.2017 నాటికి ఆన్ లైన్ లో 6.41 లక్షల లర్నింగ్, 6.13 లక్షల డ్రైవింగ్ లైసెన్స్ లు, 10.59 లక్షల రిజిస్ట్రేషన్ లు, 2.48 లక్షల ఫిట్ నెస్ సర్టిఫికెట్లు, లక్ష్యా 70 వేల పర్మిట్ లను అందించామనిమంత్రి వెల్లడించారు. ఈ సేవ, మీసేవ, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డుల ద్వారా ఆన్ లైన్ సేవలను అందిస్తూ అవనీతికి, దళారులకు తావులేకుండాచేస్తున్నట్లు చెప్పారు.హైదరాబాద్ లోనే గాకుండా మిగతా నగరాలకు ఎం-వాలెట్ ను విస్తరించాలని సభ్యులు పువ్వాడ అజయ్ తదితరులుకోరినగా
అందుకు ఏర్పాట్లు చేస్తామని మంత్రి వివరించారు. హైదరాబాద్ లోని బండ్లగూడరవాణాశాఖ కార్యాయాలనికి 33 లక్షల నిధులు అందించామని, అవసరమైనమరిన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. బెల్లంపల్లి ఎంఎల్ఏ అడిగిన ప్రశ్నకు జవాబుగా ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతీ పల్లెకు రోడ్లు నిర్మించి బస్సులు నడిపించేందుకు కృషి చేస్తుందన్నారు. రానున్న రోజుల్లో 1200 కొత్తబస్సులను కొనుగోలు చేస్తున్నామని వీటిలో పల్లెవెలుగుకు ప్రాధాన్యం ఇస్తూ నష్టాలు వచ్చినా పల్లెలకు బస్సులు నడిపిస్తామని చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *