
కరీంనగర్: మహత్మా బసవేశ్వరుని బోధనలను ఆచరణలోనికి తీసుకురావాలని అదనపు జాయింట్ కలెక్టర్ డా.ఏ. నాగేంద్ర అన్నారు. సోమవారం మహత్మా బసవేశ్వరుని 883వ జయంతి వేడుకలను ప్రెస్ భవన్ లో అత్యంత వైభవంగా జిల్లా వీరశైవ మహ సభ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించారు. ముఖ్య అతిధిగా హజరైన డా.ఏ. నాగేంద్ర మాట్లాడుతూ, ప్రభుత్వం ఈ సంవత్సరం అధికారికంగా నిర్వహించామని ఆదేశాలు జారీచేసిందని తెలిపారు. బసవేశ్వరుడు 12వ శతాబ్దంలో
హిందూ సమాజంలోని దురాచారాలను తొలగించడానికి కృషి చేశారని అన్నారు. ఆయన గొప్ప సంఘ సంస్కర్త అని, ఆనాడే స్త్ర్రీ, పురుష సమానత్వం కోసం పాటుబడిన మహనీయుడని తెలిపారు. వీరశైవ ఏర్పాటు ద్వారా హిందూ మతానికి పూర్వ వైభవం తేవడానికి కృషి చేసారని తెలిపారు. 12వ శతాబ్దంలో వచ్చిన వీరశైవ, తరువాత కాలంలో ఆయన శిఘ్యల ద్వారా వ్యాప్తి చెందిందని వీరశైవలు కోరిన విధంగా వారి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరిస్తామని హమీ ఇచ్చారు.
వీరశైవుల కొరకు రుద్రభూమి కోసం స్ధలం గురించి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఉత్సవాలను జరుపుకోవడానికి కమ్యూనిటి హల్ నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తామని అన్నారు. జిల్లా వీరశైవ మహ సభ అధ్యక్షులు నెలమడుగు శంకరయ్య మాట్లాడుతూ, బసవేశ్వర జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించినందులకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి మనిషి పనిని బట్టి గౌరవించాలని, పనిలోనే శివుడు ఉన్నాడు అని చెప్పిన మహ వ్యక్తి అని తెలిపారు.
సమాజంలోని ఆలోచనలను పరిగణలోనికి తీసుకున్న వ్యక్తి నాయకడవుతాడని తెలిపారు. తమ సమస్యల గురించి అధికారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసంబంధాల అధికారి డి.వి.జె.ఎ.వి. ప్రసాద్, వీర శైవ మహసభ ప్రధాన కార్యదర్శి అంజనీ కుమార్, ఉపాధ్యక్షులు రవి, కళ్యాణ్, ఆర్గ నైజింగ్ సెక్రటరి వీరేశం, కుమార్, మహిళా అధ్యక్షురాలు ఉమా రాజేష్, యువజన విభాగం అధ్యక్షులు, కరుణాకర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.