బలహీన వర్గాల అభివృద్ధికి టీడీపి కృషి: కళా వెంకట్రావు

బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని ఆంథ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కిమిడి కళా వెంకట్రావు తెలిపారు. గురువారం నాడు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో రాష్ట్ర్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు ఉమేష్ ఆధ్వర్యంలో కళా వెంకట్రావుకు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కళా వెంకట్రావు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారన్నారు. బడ్జెట్ లో బడుగు బలహీనవర్గాల అభివృద్ధికి అధిక నిధులు కేటాయించి వారి సంక్షేమానికి కృషి చేస్తున్నారన్నారు. వసతి గృహల నిర్వహణకు రూ. 100 కోట్లకు పైగా కేటాయించి విద్యార్ధులకు మెరుగైన సదుపాయాలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. గత ప్రభుత్వాలు వెనుకబడిన తరగతులను ఇంకా వెనక్కు నెట్టేయగా చంద్రబాబు నాయుడు గారు వారికి చేయూతనిచ్చి అభివృద్ధి పధంలో నడిపిస్తున్నారని ఆయన తెలిపారు. లోటు బడ్జెట్ ను కూడా అధిగమించి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ శాసనమండలి సభ్యులు శ్రీ టి.డి. జనార్ధనరావు గారికి సన్మనాం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ నాయకలు ఎం.బుజ్జి, నారాయణ, వంశీ, భాస్కర్, జిలానీ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *