బలవంతపు బాధ్యతలా.?

అంతా బాగున్నప్పుడు పదవులు అనుభవించారు. కాంగ్రెస్ హవా సాగినంత కాలం అన్ని విధాలుగా బాగుపడ్డారు. పేరుకు పేరు. దర్జా, హోదా పరపతి వగైరా. ఓడిపోగానే పార్టీకోసం కష్టపడాలన్న ఆలోచన లేకుండా ఎవరి దారి వారు చూసుకోవాలని భావించే వారే తెలంగాణ కాంగ్రెస్ లో ఎక్కువగా కనిపిస్తున్నారు. కొద్ది మంది మాత్రమే పార్టీ ఓడిందనే బాధతో, మళ్లీ బలోపేతం చేయాలనే కసితో పనిచేస్తున్నారు.

పీసీసీ అధ్యక్షుడిగా పొన్నాలపై వేటు వేసిన హైకమాండ్, ఉత్తం కుమార్ నెత్తిన భారం మోపింది. ఆయన కోరుకున్నారో లేక అధిష్టానం ఎంచుకుందో గానీ ఈ మార్పు మంచికేనా లేదా అనేది కాలమే చెప్పారు. అసలు… ఇది నా పార్టీ, దీన్ని ఆరునూరైనా గాడిలో పెట్టాలి, మళ్లీ గెలిపించాలనే తపన గల నాయకత్వం లేకపోవడం పెద్ద లోపం.

1983 కు ముందు సంగతి ఎలా ఉన్నా, ఆ తర్వాత మాత్రం అలాంటి నాయకుడు ఉన్నప్పుడే కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధించింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుడిగా ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నీ తానై వ్యవహరించారు. నాయకుడిగా అధికారం చెలాయించారు. పార్టీ కోసం పరిశ్రమించారు. నిధులు అవసరమైనప్పుడు అందుబాటులో ఉన్న వనరుల నుంచి సమీకరించారు. కేడర్ ను ఉత్సాహ పరిచారు. నాయకులను సమన్వయ పరిచారు. ఇది నా పార్టీ, గెలిచి సీఎం ను కావాలి అనే తపనతో పనిచేశారు.

ఇప్పుడు అలాంటి లీడర్ కావాలి. ఆ విషయంలో పొన్నాల విఫలమయ్యారని హైకమాండ్ భావించింది. మరి ఉత్తం అన్నీ తానై పార్టీని నడుపుతారా? అవసరమైతే నిధులు సమీకరిస్తారా? కేడర్ ను ఉత్తేజ పరుస్తారా? రెడ్డి సామాజిక వర్గ మద్దతును పొందుతారా? ఉన్న ప్లస్ పాయింట్లను పార్టీ కోసం వెచ్చిస్తారా? ఇలా ఎన్నో ప్రశ్నలకు ఆయన పనితీరే జవాబు చెప్పాల్సి ఉంది.

కసితో పనిచేయకపోతే నామ్ కే వాస్తే అధ్యక్షుడవుతారు. నిజంగా బరువు బాధ్యత భుజాన వేసుకుని పార్టీని గాడిలో పెడితే ఓ పెద్ద నేతగా ఢిల్లీలో గుర్తింపు పొందుతారు. వీటిలో ఏది మంచిదో ఉత్తం ఎంచుకోవాల్సి ఉందది. ఆయన సఫలమవుతారా, విఫలమవుతారా అనేది కొన్ని నెలల్లోనే తేలిపోవచ్చు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *