బలవంతంగా భూములు లాక్కుంటే ఆమరణ దీక్ష చేస్తా…

pavan kalyan

గుంటూరు, ప్రతినిధి: రాజధాని పేరు చెప్పి బలవంతంగా రైతుల నుంచి భూములు లాక్కుంటే టీడీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. గుంటూరులోని రాజధాని ప్రాంతంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ అక్కడ రైతులతో ముఖాముఖి మాట్లాడారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏపీ రాజధాని కోసం భూములు రైతులు స్వచ్ఛందంగా ఇస్తున్నారని.. ఒక వేళ బలవంతంగా తీసుకుంటే మాత్రం రైతలు తరఫున ఆమరణ దీక్ష చేస్తానని హెచ్చరించారు. ఇప్పటివరకు ఏపీకి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేదన్న పవన్ సింగపూర్ లాంటి రాజధాని నిధులు లేకుండా ఎప్పుడు పూర్తవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని కోసం విలువైన పంటలు పండే 33వేల ఎకరాలు అవసరామా అనే దానిపై చంద్రబాబుతో మాట్లాడుతానని చెప్పారు. అన్యాయం జరిగితే ప్రశ్నించడానికే జనసేన పార్టీ పెట్టానని స్పష్టం చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *