
రికార్డుల కోసం తన సినిమాను బలవంతంగా థియేటర్లలో ఆడించే అలవాటు తనకు లేదని ట్వీట్ చేశారు జక్కన్న రాజమౌళి.. సినిమాకు ప్రేక్షకులు ఘనవిజయం అందించారని 4000 స్రీన్లపై రిలీజ్ చేస్తే ప్రస్తుతం 1000 స్రీన్లపై ఆడుతోందని.. సినిమాను ఆడించడానికి రికార్డుల కోసం థియేటర్లను బ్లాక్ చేసే సంస్కృతి మాది కాదన్నారు.
సినిమా హిట్ అయ్యింది చాలు.. 50,100, 150 ,200 రోజులు ఆడే పరిస్తితులు ఇప్పుడు లేవని.. కేవలం 3, 4 వారాలు ఆడితే కలెక్షన్ తో పాటు హిట్ వస్తుందని చెప్పుకొచ్చారు.