Breaking News

బర్త్‌ డే.. డెత్‌ డే

yakub

బర్త్‌ డే.. డెత్‌ డే గా మారింది.. కొంతకాలంగా ఉత్కంఠ రేపిన ముంబై పేలుళ్ల కేసులో ప్రధాన దోషి యాకుబ్ మెమన్ ను ఎట్టకేలకు ఉరితీశారు. 1993 ముంబై పేలుళ్ల దోషి మెమన్‌కు 21 సంవత్సరాల జైలు శిక్ష అనంతరం నాగపూర్ జైళ్లో ఉదయం 6.43 గంటలకు ఉరిశిక్షను అమలు చేశారు. నిబంధనల ప్రకారం ఈ తెల్లవారుజామున యాకుబ్‌ను నిద్రలేపిన అధికారులు తలస్నానం చేశాక డెత్‌ వారెంట్‌ను మెజిస్ట్రేట్‌ చదివి వినిపించారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు విచారించిన సుప్రీంకోర్టు చివరి పిటీషన్‌ను కూడా కొట్టివేయడంతో ఇక యాకుబ్ ఉరి ఖరారైంది. ముందు నుంచి సిద్ధంగా ఉన్న నాగపూర్ కేంద్ర కారాగారం అధికారులు సుప్రీంకోర్టు తీర్పును సజావుగా అమలు చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *