బర్డ్ ప్లూ వైరస్ లేదు..చికెన్, గుడ్లు తినండి

మన దేశంలో బర్డ్ ప్లూ వైరస్ లేదు..చికెన్, గుడ్లు నిర్భయంగా తినవచ్చని మంత్రి ఈటెల రాజేందర్సూచించారు.కరీంనగర్ తెలంగాణ చౌక్ లో శనివారం జరిగిన చికెన్ మేళాలో ఆయన మాట్లాడుతూ మన దేశంలో వంటలువండే విధానం వల్ల మనకు ఎలాంటి వైరస్ సోకదని నిర్భయంగా చికెన్, గుడ్లు తినవచ్చని , మా ఇంట్లో ప్రతి రోజు చికెన్, గుడ్లతో భోజనం చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ వీటిని భుజించి ఆరోగ్యంగా ఉండాలన్నారు. కోళ్ల పరిశ్రమ అనేక మందకి ఉపాధి కల్పిస్తుందన్నారు. ఈ పరిశ్రమ వల్లరైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని,  ప్రజలు కోళ్ల పరిశ్రమను ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలోఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పుట్ట మధు, రసమయి బాలకిషన్, జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ, మేయర్ రవీందర్ సింగ్, జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *