బన్నీ వరుస హిట్ లకు కారణం ఇదే..

తెలుగు హీరోలకు పరిమితి తక్కువ.. బావిలో కప్పలాగా ఎంత సేపు తెలుగు సినిమాలే ట్రై చేస్తుంటారు. ఇక్కడ హిట్ దొరికితే చాలు అన్న అల్స సంతోషంతో బతికేస్తుంటారు.. అందుకే ఇతర భాష చిత్రాల హీరోలు తమ సినిమాల మార్కెట్ ను పెంచుకొని తెలుగులో దున్నేస్తుంటే తెలుగు హీరోలు ఒకరు ఇద్దరు తప్ప ఇతర మార్కెట్లోకి వెళ్లింది లేదు.. ఆ దుస్థితి పోవాలని అభిమానులు కోరుకుంటున్నా తెలుగు హీరోలు ఆ సాహసం చేయడం లేదు..
కానీ ఒక్కడు ఒకే ఒక్కడు మాత్రం తన మార్కెట్ ను విస్తృత పరచడంలో ఎప్పుడు ముందుంటాడు.. తన సినిమాల ప్రస్థానం మొదలైనప్పటి నుంచి ఏదో పక్క రాష్ట్రంలో రిలీజ్ చేస్తూ అభిమానులను సంపాదించుకుంటూనే ఉంటున్నాడు. అదే క్రమంలో అల్లు అర్జున్ కేరళలో తన మార్కెట్ మాలయాళంలో బాగా పెంచుకున్నాడు. ఇప్పుడక్కడ మలయాళ నటులతో సమానంగా బన్నీ సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. తెలుగు, మలయాళ మార్కెట్ తో ప్రస్తుతం బన్నీ దక్షిణాది నటుడిగా పేరుపొందారు.
బన్నీ దృష్టి ఇప్పుడు తమిళ మార్కెట్ పై పడింది. ఎనర్జటిక్ హీరోగా గుర్తింపు పొందిన బన్నీ కోసం ప్రముఖ తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ కథ చెప్పడం అల్లు అర్జున్ ఓ కే చెప్పడం జరిగిపోయాయి. తెలుగు, తమిళంలో రిలీజ్ అయ్యే ఈ చిత్రం హిట్ అయితే మన అల్లు అర్జున్ కు తమిళనాడులో మార్కెట్ లభిస్తుంది. దీంతో తెలుగు, తమిళ, మలయాళ స్టార్ గా మొత్తంగా బన్నీ దక్షిణాది సూపర్ స్టార్ గా ఎదిగిపోతాడు.. ఇలానే అందరూ ఆలోచిస్తే తెలుగు హీరోల స్టామినా దశదిలా సాగుతుంది. ఇప్పుడిప్పుడు మహేశ్ బాబు కూడా తమిళంలో పాగా వేస్తున్నాడు. మురగదాసు చిత్రం తెలుగు, తమిళంలో రిలీజ్ అవుతోంది. దీంతో తెలుగు హీరోల దృష్టిలో ఇప్పుడిప్పుడే మార్పు వస్తుందనడంలో సందేహం లేదు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *