బద్రాద్రి తరహలో ఇల్లందకుంట దేవాలయం అభివృద్ధికి కృషి: మంత్రి ఈటెల రాజేందర్

కరీంనగర్: ఖమ్మం జిల్లా బద్రాచలంలో గల శ్రీ సీతారామ స్వామి దేవాలయం తరహలో ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేయుటకు కృషి చేస్తానని ఆర్ధిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. గురువారం జమ్మికుంట మండలం ఇల్లందకుంట గ్రామంలో గల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్ధాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బద్రాచలం తర్వాత ఇల్లందకుంట లోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం రెండవదని దీనిని కరీంనగర్ జిల్లాలో ధర్మపురి, కాళేశ్వరం, వేములవాడ దేవస్ధానం తరహలో అభివృద్ధి చేయుటకు కృషి చేస్తానని అన్నారు. ఈ దేవాలయం ఆవరణలో టూరిజం ద్వారా హరిత హోటలు నిర్మిస్తామని ప్రభుత్వం తరపున విశ్రాంతి భవనం నిర్మిస్తామని తెలిపారు. 75 లక్షలతో భక్తుల నీడ కొరకు రెండు పెద్ద షడ్డుల నిర్మాణం పనులు చేపట్టామని భక్తులకు
ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. ప్రతిరోజు భక్తులు వేల సంఖ్యలో దైవ దర్శనానికి వచ్చేలా దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు. దేవాలయ ఆవరణలో పెద్ద దుకాణాల సముదాయాన్ని నిర్మించి వందల మందికి జీవనోపాధి కల్పిస్తామని పేర్కొన్నారు. వచ్చే సంవత్సరంలోగా అన్ని వసతులతో పాటు జమ్మికుంట నుండి దేవాలయం వరకు నాలుగు వరుసల రహదారిని నిర్మిస్తామని తెలిపారు. వాస్తు ప్రకారం రాజ గోపురంతో పాటు అన్ని నిర్మాణాలు చేపడుతున్నామని గ్రామస్తులు, దేవాలయ కమిటి సభ్యులు రోజు పనుల ప్రగతిని పర్యవేక్షించాలని సూచించారు. త్రాగునీటి సమస్య నివారణకు వెంటనే నాలుగు బోర్లు వేయించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ స్వరూప, జమ్మికుంట నగర పంచాయితీ చైర్ పర్సన్ పొడేటి రామస్వామి, ఎం.పి.టి.సి. రామ్ స్వరన్ రెడ్డి, తహసీల్దార్ రజని, ఆలయ కమిటి చైర్మన్ సురేందర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ కొమురెల్లి తదితరులు పాల్గొన్నారు.

DSC_8802

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *