
ఆస్ట్రేలియాలో కంగారుల బతుకు ప్రశ్నార్థకమైంది. మెల్ బోర్న్ లోని నేషనల్ పార్క్ లోని కంగారులను చంపేయాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. దీనిపై అక్కడి జంతు ప్రేమికులు ఆందోళనలకు, కోర్టులో న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు..
ఇంతకీ అసలు విషయం ఏంటంటే ప్రపంచంలోనే అరుదైన ఎక్కడ ఉండని కంగారూలు ఆస్ట్రేలియాలో అనాధిగా నివసిస్తున్నాయి. వీటి సంరక్షణను గతంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని వాటిని చంపకుండా నిషేధించింది. దీంతో దేశంలోని అడవుల్లో కంగారులు విపరీతంగా పెరిగిపోయాయి. వీటి దెబ్బకు దేశంలోని అడవులన్నీ ఖాళీ అయిపోతున్నాయట.. ఆకలి బాధలకు పెరిగిపోయిన కంగారులు చెట్ల ఆకులను తినేస్తున్నాయి. దీంతో ఆకులు లేని చెట్లు ఎండిపోయి పర్యావరణానికి చేటు తెస్తున్నాయట.. దీంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం కంగారులను చంపాలని నిర్ణయించింది.
కాగా కంగారులను చంపవద్దని. వాటికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేసి వదిలిపెట్టాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. ఆ దిశగా ప్రభుత్వం కూడా పరిశోధనలు చేస్తోందట.. మరి కంగారుల బతుకు ఏమవుతోందో మరికొద్దిరోజుల్లో తేలనుంది..