బతుకమ్మ గిన్నిస్ బుక్ఆఫ్ రికార్డ్స్ కు భారీ వర్షం వల్ల అంతరాయం

????????????????????????????????????

తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ అధ్వర్యంలో లాల్ బహదూర్ స్టేడియంలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసం  రెండు విభాగాలలో ప్రయత్నించిడం జరిగిందన్నారు తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక , పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం. తెలంగాణ రాష్ట్ర అధికారిక పుష్పం తంగేడు పువ్వు ఆకారంలో సుమారు మూడు వేల మంది మహిళలు చేసిన ప్రయత్నాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు రిహాల్సల్ గా భావించినట్లు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పర్యవేక్షణ  అధికారి సోప్నైల్ తెలిపారు. రెండవ విభాగం లో రికార్డ్ కోసం ప్రయత్నం చేయటానికి ఏర్పాట్లు చేసే సమయంలో భారీ వర్షం రావడం వల్ల సుమారు మూడు వేల మంది మహిళలు ఓకేసారి వేగంగా బతుకమ్మ పేర్చడం కోసం చేసే ప్రయత్నానికి అంతరాయం కలిగిందని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పర్యవేక్షణ  అధికారి సోప్నైల్ వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ అధ్వర్యంలో లాల్ బహదూర్ స్టేడియంలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసం చేసిన ప్రయత్నాలను భారీ  వర్షం వల్ల అంతరాయం కలిగినందున
చింతిస్తున్నామన్నారు. వివిధ జిల్లాల నుంచి స్వచ్చందంగా తరలివచ్చిన మహిళలకు ఆభినందనలు తెలిపారు.  గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ప్రభుత్వం చేసిన రెండు విభాగాలను  రిహాల్సల్ గా భావించినందున  మరో సారి విలైనంత త్వరలో నిర్వహించేందుకు అనుమతి ఇచ్చారన్నారు. త్వరలో ఈ రెండు విభాగాలలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్  కోసం ప్రయత్నం చేస్తామన్నారు  తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక , పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం. ఈ కార్యక్రమంలో తెలంగాణ పర్యాటక శాఖ కమీషనర్ సునిత భగవత్, టూరిజం కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టినా చోంగ్తూ,  తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ,గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు, తెలంగాణ జాగృతి కార్యకర్తలు  పాల్గోన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *