బతుకమ్మకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు

పూలను దేవతలుగా కొలిస్తూ నిర్వహించే ఏకైక పండుగ బతుకమ్మకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందని కరీంనగర్ పోలీస్ కమీషనర్ విబి కమలాసన్ రెడ్డి అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రాచుర్యంలోని తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉందని పేర్కొన్నారు. ఆదివారం నాడు కరీంనగర్ పోలీస్
కమీషనరేట్ కేంద్రంలో పోలీసు కుటుంబాలతో బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో పోలీస్ కమీషనర్ విబి కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ పల్లె ప్రాంతాల్లో బతుకమ్మకు వందలాది సంవత్సరాల చరిత్ర ఉందన్నారు. తెలంగాణ ఉధ్యమం ప్రభావంతో నేడు పట్టణాలు, నగరాలు, తెలుగు
ప్రజలు నివసిస్తున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో నేడు బతుకమ్మ పండుగను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఫ్యామిలీడే, మ్యూజికల్ నైట్ ల నిర్వహించామని, పోలీసు కుటుంబసభ్యులందరూ కలిసి జరుపుకునే కార్యక్రమాలను కొనసాగిస్తామని చెప్పారు. జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు కుల, మత, వర్గ విభేదాలను విడనాడి జరుపుకునే ఏకైక పండుగ బతుకమ్మ అన్నారు. పోలీసు కుటుంబాలతో కలిసి ఈ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొనడం మధురానుభూతిని మిగిల్చిందని తెలిపారు.
ఉత్సాహంగా… ఉల్లాసంగా…
పోలీసు కుటుంబాలు, ఇతర ప్రభుత్వశాఖలకు చెందిన అధికారులు, మహిళ అధికారులు, కటుంబ సమేతంగా బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా, ఉల్లాసంగా పాల్గొన్నారు. బతుకమ్మకు సంబందించిన ప్రతి అంశాన్ని వివరిస్తూ గీతాలు ఆలపించారు. పోలీసులు సమాజానికి అందిస్తున్న సేవలను వివరిస్తూ రూపొందించిన సురక్ష బతుకమ్మ
పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ కార్యక్రమాన్ని పోలీస్ కమీషనర్ సతీమణి విబి రాధిక పూజా కార్యక్రమాలను నిర్వహించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సతీమణి డాక్టర్ సనా, శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ కోమల్ రెడ్డి, డిఎఫ్ ఓ శ్రీనివాస్, ఎసిపిలు జె రామారావు, వి. తిరుపతి, యం రవీందర్ రెడ్డి, ఆర్ ఐ గంగాధర్, కమీషనరేట్ పరిధిలోని ఇన్స్ పెక్టర్లు, మహిళ పోలీసులు, హోంగార్డులు కుటుంబ సభ్యుల సమేతంగా పాల్గొన్నారు.

vb radhika    vb radhika1     vb radhika2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *