బడ్జెట్ ప్రతిపాదలనపై అధికారులతో మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష

* బడ్జెట్ ప్రతిపాదలనపై అధికారులతో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష

* వచ్చే ఆర్ధిక సంవత్సరంలో కావలసిన నిధులపై వాస్తవ ప్రతిపాదనలే రూపొందించాలి

* మూస పద్దతికి దూరంగా అవసరమైన నిధులను కోరుదాం

* రెండు లక్షల మంది ఒంటరి మహిళలకు పెన్సన్ అందించేందుకు ప్రతిపాదనలు

* ఒంటరి మహిళలకు సంబంధించి సమగ్రంగా సర్వే చేసి త్వరితగతిన పక్కా ప్రతిపాదనలు రూపొందించాలని మంత్రి ఆదేశం

* ఏప్రిల్ 1 నుండి ఒంటరి మహిళలకు ఫించన్లు అందేలా జాబితా సిద్దం చేయాలి

* ఇప్పటి వరకు రోడ్ కనెక్టివిటీ లేని 459గ్రామపంచాయతీలకు రోడ్ల నిర్మాణం జరపాల్సిన అవసరం ఉంది

* 500 పైగా జనాభా ఉన్న గిరిజన తండాలతో పాటు, ఎస్సీ కాలనీలకు రహదారి సౌకర్యం కల్సించాలి

* మన ఊరు – మన ప్రణాళిక, గ్రామజ్యోతి కార్యక్రమాలకు కూడా నిధుల కేటాయింపు కోరుదాం

* జాబ్ కార్డు కలిగి ఉన్న కనీసం 60 శాతం  మందికి ఉపాధి పనులు కల్పించడమే మన లక్ష్యం

* ఉపాధి పనుల కోసం అవసరమైన నిధులకు ప్రతిపాదనలు పక్కాగా ఉండాలి

 

హైదరాబాద్ : ఒంటరి మహిళలకు సంబంధించి సమగ్రంగా సర్వే నిర్వహించాలని, ఏప్రిల్ 1 నుండి వారికి పింఛన్లు అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు.2017-18 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి రూపొందించిన బడ్జెట్ ప్రతిపాదనపై అధికారులతో సుధీర్ఘంగా చర్చించారు. దాదాపు 2 లక్షల మంది ఒంటరి మహిళలకు పింఛన్ అందజేసేందుకు 247 కోట్లు అవసరమవుతాయని రూపొందించిన అధికారులతో చర్చించారు. జిల్లాల వారీగా ఒంటరి మహిళలకు సంబంధించి సమాచారం సేకరించాలని, వారి సంఖ్యను గుర్తించాలని సూచించారు. ఇప్పటికే ఏప్రిల్ 1 నుంచి ఒంటరి మహిళలకు పింఛన్ అందజేయాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారని, వీరికి ఏప్రిల్ నెల నుండి ఆసరా పింఛన్ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటి వరకు రోడ్ కనెక్టివిటీ లేని 459గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించడంపైదృష్టి సారించాలని, దీనికి అవసరమైన నిధులకు సంబంధించి ప్రతిపాదనలు పక్కాగా ఉండాలని ఆదేశించారు. అలాగే 500కు పైగా జనాభా ఉన్న గిరిజన తండాలు, ఎస్సీ కాలనీలకు రహదారి సౌకర్యం కల్పించడాన్ని ప్రాధాన్యత అంశంగా పెట్లుకోవాలని సూచించారు. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లో జాబ్ కార్డు కలిగి ఉన్న కనీసం 60శాతం మంది కూలీలకు ఉపాధిహామీ పనులు కల్పించాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్రం నుండి వచ్చే నిధులు ఎన్ని?రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు నిధులనుకేటాయించాల్సిన నిధులెన్ని అన్న అంశంపై అధికారులతో చర్చించారు. మన ఊరు –  మన ప్రణాళిక, గ్రామజ్యోతికి అవసరమయ్యే నిధులపైన అధికారులతో చర్చించారు.మూస పద్దతిలో కాకుండా, వాస్తవ అవసరాలకు అనుగుణంగా ప్రతిపాదనలు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. గత కేటాయింపులతో సంబంధం లేకుండా వచ్చే ఆర్ధిక సంవత్సరంలో అవసరమయ్యే నిధులెన్ని అనే విషయమే ప్రామాణికంగా ప్రతిపాదనలు ఉండాలన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *