
బజరంగీ భాయ్ జాన్ సినిమా రావడంతో ఒక నిజజీవత కథ వెలుగుజూసింది.. 2003లో భారత్ నుంచి వెళ్లిన మూగ బాలిక రైలు ద్వారా పాకిస్తాన్ కు చేరింది. అనంతరం కరాచీలోని ఈద్ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలోని ఆశ్రమంలో ఉంటోంది..
కాగా బజరంగీ భాయ్ జాన్ సినిమా విడుదలైన అనంతరం సినిమా చూసిన పాకిస్తాన్ లోని గీత, ఈద్ సంస్థ తమ తల్లిదండ్రులు ఇండియాలో ఉన్నట్టు తెలిపింది. కొందరి ఫొటోలను తన ప్రాంత మ్యాప్ లను గుర్తించింది. బీహార్ లోని తల్లిదండ్రులు తప్పిపోయిన బాలిక గీత మా కూతురే అంటూ నిర్ధారించారు. దీంతో కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ గీతను భారత్ కు రప్పించేందుకు ప్రయత్నాలు చేశారు.
ఇవాళ గీత, ఈద్ సభ్యులు భారత్ కు వస్తున్నారు. గీత భారత్ కు రాగానే ఆమెకు, బీహార్ లోని ఆమె తల్లిదండ్రులుగా చెప్పుకుంటున్న వారికి డీఎన్ఏ టెస్ట్ లు చేసి నిర్ధారణ అయితేనే గీతను వారికి అప్పగిస్తారు.