బచ్ పన్ సే లుటాదో..

చిన్న పిల్లల మారాం కొందరికి సరదాగా ఉంటుంది. కొందరు పిల్లల అల్లరి చికాకు తెప్పిస్తుంది. కానీ మారుతున్న సమాజ పోకడలతో వారి జీవితం సైతం యాంత్రికంగా మారుతోంది. మా చిన్నప్పుడు కనీసం 6 ఏళ్ల వరకు కూడా స్కూలు కెళ్ల లేదు. కానీ ఇప్పుడో ప్లే స్కూళ్ల పేరు చెప్పి 18 నెలల పాపను సైతం బడులకు పంపిస్తూ వారి బాల్యాన్ని హరించివేస్తున్నారు. ఈ తరహాలో పిల్లల హక్కులు రోజురోజుకు హరించుకుపోతున్నాయి. చదువుల పేరు చెప్పి చిన్నపూటి ఊహాలు,, ఊసులు పెద్దలకు, ఇటు చిన్నపిల్లలకు దూరం అవుతున్నాయి. అటువంటి ప్లే స్కూళ్లు నేడు నగరాలు, పట్టణాల్లో పుట్ట గొడుగుల్లా వెలుస్తున్నాయి.

ఈ కాలంలో భర్యాభర్తలు పనిచేస్తేనే పూటగడిచేంది. దీంతో పిల్లలు వారికి భారంగానే మారుతున్నారు. 2 సంవత్సరాల వయసు నుంచే వాళ్లను స్కూళ్లకు పంపిస్తూ మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారు. ఈ తరహా చదువులు సమాజ పోకడలకు వ్యతిరేకం.. వాటిని నివారించకపోతే బాల్యం.. భారంగానే తయారవుతుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *