
రైతు ఆత్మహత్యలపై ప్రతిపక్షాలు ఇచ్చిన బంద్ పిలుపులో భాగంగా టీడీపీ, కాంగ్రెస్ ఆధ్వర్యంలో కరీంనగర్ బస్టాండ్ , తెలంగాణ చౌక్ వద్ద భారీ ధర్నాలు జరిగాయి.. డీసీసీ అధ్యక్షులు కటకం మృత్యుంజయం, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి శ్రీధర్ బాబు లు పాల్గొని బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా కటకం, పొన్నంలను పోలీసులు లాగి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కార్యకర్తల తోపులాటలు, వాగ్వాదాలతో బంద్ ఉద్రిక్తంగా మారింది..