Breaking News

బండారు దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ గుండెపోటుతో మృతి

IMG-20180523-WA0120

కేంద్ర మాజీ మంత్రి సికింద్రాబాద్ లోక్‌సభ సభ్యుడు బండారు దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్గుం డెపోటుతో మృతి చెందారు .
కేంద్ర మాజీ మంత్రి సికింద్రాబాద్ లోక్‌సభ సభ్యుడు బండారు దత్తాత్రేయ కుమారుడు గుండెపోటుతో మృతి చెందారు .

హైదరాబాద్ రాంనగర్ లోని నివాసంలో మంగళవారం రాత్రి పదిన్నర గంటలకు కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేస్తుండగా బండారు వైష్ణవ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

వెంటనే బండారు దత్తాత్రేయ , డాక్టర్ ఆవుల రామచంద్రరావు తదితరులు సమీపంలోని కేర్ ఆసుపత్రిలో చేర్చారు .

సార్ మేము చూసుకుంటాం కదా మీరు ఇంటికెళ్లండి అని చెప్పడంతో దత్తాత్రేయ ఇంటికెళ్లి నిదురపోయారు.

తరువాత పన్నెండున్నర గంటల సమయంలో వైష్ణవ మరణించాడని డాక్టర్లు అధికారికంగా ప్రకటించారు . తన కుమారుడు మరణించిన విషయం దత్తాత్రేయ కు తెలియదు .

మీడియా మిత్రుల ద్వారా విషయం తెలుసుకున్న హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ ఒంటి గంట రాత్రికి వచ్చి చూసి పోయారు.

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ముషీరాబాద్ శాసనసభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ .శాసనసభ్యడు చింతల రామచంద్రారెడ్డిలు తెల్లవారు జామున మూడు గంటలకు ఆసుపత్రికి చేరుకున్నారు .

ఉదయం ఐదు గంటలకు నిదుర లేచిన దత్తాత్రేయ కు విషయం తెలిపారు . హుటాహుటిన దత్తాత్రేయ , ఆయన సతీమణి తదితర కుటుంబ సభ్యులు, భాజపా కార్యకర్తలు ఆసుపత్రికి చేరుకున్నారు .

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *