బంగ్లా బెబ్బులి మెడలు వంచిన భారత్

ఆసియా కప్ ఫైనల్ కు ఆతిథ్య బంగ్లాదేశ్ చేరగానే అక్కడి అభిమానుల హద్దుకు అదుపు లేకుండా పోయింది. భారత కెప్టెన్ ధోని తలను బంగ్లా బౌలర్ టస్కిన్ చేతిలో పట్టుకొని చెడుగుడు ఆడినట్టు చేసి భారత కెప్టెన్ ను అవమానించారు. టీమిండియా ఓటమి ఖాయమంటూ బంగ్లాలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ భారత ఆటగాళ్ల పట్టుదల, మెరుగైన ఆటతీరుతో బంగ్లాదేశ్ బెబ్బులి మెడలు వంచి చిత్తుగా ఓడించారు.

మొదట బౌలింగ్ చేసిన భారత్ బంగ్లాదేశ్ ను చిత్తు చేసింది. 15 ఓవర్లకు కుదించిన మ్యాచ్ లో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి బంగ్లాదేశ్ ను 120 పరుగులకే కట్టడి చేశారు. అనంతరం భారత టాప్ ఆర్డర్ రాణించడంతో 13.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. ధావన్ 60, కోహ్లీ 41, ధోని 20 పరుగులు చేసి మ్యాచ్ ను గెలిపించారు. ఫైనల్లో రాణించిన ధావన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *