బంగ్లా పర్యటనలో మోడీకి ఘనస్వాగతం

ఢాకా : రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోడీ శనివారం బంగ్లాదేశ్ కు బయలు దేరారు. ఆ దేశ రాజధాని ఢాకాలో అడుగిడిన ప్రధాని మోడీకి బంగ్లా ప్రధాని షేక్ హసీనా ఘనంగా స్వాగతం పలికారు. తన పర్యటనపై మోడీ ట్విట్టర్ రాసుకొచ్చారు. ఈ పర్యటన రెండు దేశాల సంబంధాలను బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.  ఈ పర్యటనలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఉన్నారు.  ఇరుదేశాల మధ్య భూ ఒప్పందాలు, వాణిజ్య పెంపు తదితర అంశాలపై ఒప్పందాలు జరగనున్నాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *