Breaking News

బంగ్లాదేశ్ కు లాభం చేసిన వర్షం

6178142-3x2-700x467

-వర్షంతో బంగ్లా, ఆస్ట్రేలియా మ్యాచ్ రద్దు
-రెండు జట్లకు చెరో పాయింట్
వర్షం వచ్చి బంగ్లాదేశ్ జట్టుకు ఒక పాయింట్ ను తెచ్చిపెట్టింది. ఈ మ్యాచ్ జరిగివుంటే ఖచ్చితంగా బంగ్లాదేశ్ ఓడిపోయి ఉండేది. ఎందుకంటే ఆస్ట్రేలియా ప్రపంచనంబర్ వన్ జట్టు. బంగ్లాదేశ్ పసికూన. ఆస్ట్రేలియాలో సొంతగడ్డపై ఆ జట్టును ఓడించడం కష్టం.. దీంతో మ్యాచ్ రద్దవడం ఓ రకంగా బంగ్లాదేశ్ కు అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ ఎడతెరిపి లేని వర్షం కారణంగా ఒక బాల్ పడకుండానే రద్దయ్యింది.

పాకిస్తాన్ పై వెస్టీండీస్ ఘన విజయం
పాకిస్తాన్ వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. మొదటి మ్యాచ్ లో భారత్ చేతిలో ఓడిన పాక్ రెండో మ్యాచ్ వెస్టిండీస్ చేతిలో ఓడిపోయింది. వెస్టిండీస్ మొదట 50 ఓవర్లలో 310/6 పరుగులు చేయగా.. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన పాక్ ఆటగాళ్లు ముగ్గురు డకౌట్ అయ్యారు. ఘోర బ్యాటింగ్ వైఫల్యంతో 39 ఓవర్లలో పాకిస్తాన్ 160 పరుగులకే అలౌట్ అయ్యింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *