బంగారు మనిషి హైదరాబాద్ లో..

హైదరాబాద్ : అతడి పేరు పంకజ్ పరేఖ్ , మహారాష్ట్రలోని యోలో పట్టణానికి చెందిన కోటీశ్వరుడు.. చిన్నప్పటి నుంచి బంగారంపై మోజెక్కువ. అందుకే కోట్లకు పడగలెత్తిన ఈ పంకజ్ 4 కిలోల బంగారంతో చొక్కా తయారు చేసుకొని వేసుకున్నాడు. ఒంటినిండా నగలు, చేతులకు బంగారు ఉంగారాలు, మెడ, చేతులకు బంగారు పట్టీలు మొత్తంగా ఆయన ఒంటిపై 8 కిలోల బంగారం ఉంటుంది.

కాగా ఆయన హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో ఉంటున్న సోదరుడి గృహప్రవేశానికి వచ్చాడు. అంతా బంగారం ఒంటిపై ఉండడంతో బాడీ గార్డులను నియమించుకున్నాడు. కాగా ఈ బంగారు మనిషితో ఫొటోలు దిగడానికి స్థానికులు పోటీ పడ్డారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *