బంగారు తెలంగాణ నిర్మాణం లక్ష్యంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు

కరీంనగర్: బంగారు, ఆకుపచ్చ, భాగ్యవంతమైన తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని రాష్ట్ర్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం ఎలగందల్ లో 60 కోట్లతో మంజూరైన కరీంనగర్ నుండి ఎలగందల్ పాత రోడ్డు పున:నిర్మాణం,వంతెన నిర్మాణ పనులను రాష్ట్ర్ర ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ ఉద్యమానికి ఊపిరులు ఊదిన జిల్లా కరీంనగర్ జిల్లా అని కొనియాడారు. జిల్లా సమాగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి ప్రాధాన్యతనిస్తారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర్ర అభివృద్ధిపై సమగ్ర సర్వే చేసి, ఆయన ఇచ్చిన బ్లూ ప్రింటు ప్రకారమే అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర్రం సాధించుకున్న 3నెలల లోపే రాష్ట్ర్రంలో రెప్పపాటు కరెంటు పోకుండా చేసిన ఘనత ముఖ్య మంత్రిదేనని ఆయన అన్నారు. లక్షల కోట్లుతో విద్యుత్ సరఫరా, మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ, రహదారులఅభివృద్ది, సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఒక సంవత్సరం ముందుగానే ప్రతి ఇంటికి నల్లా నీరు ఇచ్చామని అన్నారు. దేశంలోని ఇతర రాష్ట్ర్రాల ముఖ్య మంత్రులు రాష్ట్ర్రంలో జరుగుతున్న మిషన్ భగీరధ పధకం వైపు చూస్తున్నారని తెలిపారు. ప్రతి పక్షాలు ఎన్ని ఆటంకాలు, అడ్డంకులు సృష్టించిన వాటిని అధికమించి అభివృద్ధిలో ముందుకెలుతున్నామని ఆయన అన్నారు. 30 గ్రామాలు ఉన్న కరీంనగర్ నియోజక వర్గానికి ఇదివరకే 350 కోట్లు ఇచ్చామని, ఎమ్మెల్యే కోరిక మేరకు ఎలగందల్-గూడెం, ఖాజీపూర్ రోడ్డుకు 5కోట్లు మంజూరు చేస్తామని తెలిపారు. 5గురు రాజ వంశీయులు పాలించిన ఎలగందల్ ఖిల్లాకు ఘన చరిత్ర గలదని తెలంగాణ ప్రజలందరు తెలుసుకునేలా తనవంతు సహయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
స్వాతంత్ర్యం వచ్చిన నుండి జరిగిన అభివృద్ధి ఒక సంవత్సరాలలో చేశామని తెలిపారు.
రాష్ట్ర్ర ఆర్ధిక పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ఎలగందల్ ను గొప్ప పర్పాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు. 60కోట్లతో బ్రిడ్జి నిర్మాణం, పాత రోడ్డు నిర్మాణం ఎలగందల్ ఖిల్లా చరిత్ర, గొప్పదనం ప్రపంచానికి తెలపటానికి అని అన్నారు. ఎలగందల్ గ్రామాన్ని గొప్ప వ్యాపార కేంద్రంగా తీర్చి దిద్దుతామని తెలిపారు. 150 కోట్లతో మానేరు నదిపై లండన్ తరహ సెన్సేషన్ బ్రిడ్జి మంజూరు చేశామని తెలిపారు. ఎల్.ఎం.డి క్రింద క్రింద 500 కోట్లతో రివర్ ఫ్రింట్ నిర్మాణం మంజూరు మంజూరు అవుతుందని తెలిపారు. ఇది ఆస్ట్ర్రేలియా లోని గోల్డు కోస్ నగరంలో నిర్మించిన మాదిరిగా నిర్మిస్తామని తెలిపారు. పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ 60 కోట్లతో నిర్మించే రోడ్డు, వంతెన తెలంగాణ ప్రజలకు ఉపయోగపడుతుందని అన్నారు.పర్యాటకుల సౌకర్యార్ధం ఈ రోడ్డు అని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఎలగందల్ లో పర్యాటక కేంద్రంతో పాటు అన్ని శుభ కార్యాలు జరుపుకునేలా సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. కరీంనగర్ ఎమ్మెల్యే కృషి వల్ల ఈ రోడ్డు మంజూరు అయిందని, దీనిపై గల స్టేను తొలగించుటకు నా వంతు కృషి చేశానని తెలిపారు. రాష్ట్ర్రం వచ్చిన తర్వాత జగిత్యాల,కరీంనగర్, హుజూరాబాద్, కరీంనగర్, వేములవాడ,సిరిసల్ల, సిద్దిపేట,జనగాం, జాతీయ రహదారుల మంజూరు అయినాయని తెలిపారు. ఈ రోడ్డు 65 మీటర్ల వెడల్పతో ఉంటాయని తెలిపారు. రాజీవ్ రమదారి నిర్మాణం చాలా దారుణంగా ఉందని, త్వరలో బాగు చేస్తామని తెలిపారు. రైల్వే బడ్జెటులో 350 కోట్లు కేంద్రం కేటాయించిదని, గతంలో ఏ ప్రభుత్వం ఇంత బడ్జెటు కేటాయించలేదని అన్నారు. ఉద్యమ స్ఫూర్తితో అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ అధ్యక్షురాలు తుల ఉమ, శాసయ మండలి సభ్యులు నారదాసు లక్ష్మణ్ రావు, శాసన సభ్యులు గంగుల కమలాకర్, డైరీ ఛైర్మన్, సి.హెచ్. రాజేశ్వరరావు, ఎమ్,పి.పి వాసాల రమేష్, జెడ్.పి.టి.సి శ్రీనివాస్, సర్పంచ్ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *