బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములుకావాలి

బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములుకావాలి

– తాజా మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు
టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని తాజా మాజీ ఎమ్మెల్యే, పాలకుర్తి నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రుర్ మండలం గుర్తుర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు పాలకుర్తి నియోజకవర్గాన్ని రాష్ట్ర్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. టీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధిని, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఎన్నికల్లో కారుగుర్తుకు ఓటేసీ భరీ విజయాన్ని అందించాలని కోరారు పాలకుర్తి అభివృద్ధి విషయంలో ప్రణాళిక బద్దంగా వెళ్తున్నానని, నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు సాగు, తాగు నీరు మౌలిక వసతుల కల్పన తన ధ్యేయమని అన్నారు. గ్రామాల్లో అంతర్గత రోడ్లు వేయించేందుకు కృషి చేశానన్నారు. రానున్న రోజుల్లో అన్ని గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు మహిళలు మంగళహారతులు, కోలాటం, ఆటపాటలు, బతుకమ్మలు, బోనాలు, డప్పుచప్పుళ్లు, ఒగ్గుడోళ్లతో ఘనస్వాగతం పలికారు.

errabelli dayakar rao 1     errabelli dayakar rao 2     errabelli dayakar rao 3     errabelli dayakar rao 4     errabelli dayakar rao 5    errabelli dayakar rao 6

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *