బంగారు తెలంగాణ కోసం బతకండి..

బంగారు తెలంగాణ సాధించుకుంది ప్రాణాలను తీసుకోవడానికి కాదని.. రైతులందరూ భరోసా నింపుకుని ధైర్యంతో తెలంగాణలో బతికి సాధించాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఆయన నిన్న శాసనసభలో రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. రైతులను తమ ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని చెప్పారు.

ఉమ్మడి రాష్ట్రంలో ప్రాంతీయ వివక్ష, 58 ఏళ్లుగా జరిగిన అన్యాయాలే ఆత్మహత్యలకు కారణం. ఆత్మహత్యలు దేశమంతటా జరుగుతున్నాయి. వీటి నివారణకు దీర్ఘకాలిక చర్యలు తీసుకుంటాం. హైకోర్టు గొప్ప సూచన మేరకు మూలాలు తెలుసుకొని నివారిస్తాం.. రైతు రుణాలను ఒకే దఫా మాఫీ చేసేందుకు యత్నిస్తున్నాం. వడ్డీ వ్యాపారుల నియంత్రణ చట్టం తెస్తాం. అని సీఎం శాసనసభా వేదికగా ప్రకటించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *