బంగారు తెలంగాణకు శ్రీకారం కాళేశ్వరం ప్రాజెక్టు

బంగారు తెలంగాణకు శ్రీకారం కాళేశ్వరం ప్రాజెక్టు

కాళేశ్వరమూ ఉద్యమమే.

రీ డిజైన్,గోదావరి రివర్స్ పంపింగ్ ఒక అద్భుతం.

ప్రపంచ స్థాయిలో టి.ఎస్.ఇంజనీర్ల ప్రతిభ.

ఊహకు అందని విజ్ఞానం.

బంగారు తెలంగాణకు కాళేశ్వరంతో శ్రీకారం.

ప్రొఫెసర్ ల బృందం.

కాళేశ్వరం ప్రాజెక్టుతోనే బంగారు తెలంగాణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలంగాణ ప్రొఫెసర్ల బృందం వ్యాఖ్యానించింది.పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ఆధ్వర్యంలో వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్ లు రెండు రోజుల పాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన బ్యారేజీ లు,పంప్ హౌజ్ లు,టన్నెల్స్ నిర్మాణ పనులను పరిశీలించారు.ఈ ప్రాజెక్టు లో ప్రతి చోటా పనులన్నీ ఒక ఉద్యమం వలె జరుగుతున్నట్టు ప్రొఫెసర్ ల బృంద సారధి ఘంటా చక్రపాణి చెప్పారు. రెండు రోజుల పాటు కాళేశ్వరం పర్యటనలో ఊహకు అందని విజ్ఞానం కనిపించిందని ఆయన అన్నారు. తెలంగాణ ఇంజనీర్ల అబ్బురపరిచే ప్రతిభ అంతర్జాతీయ స్థాయిలోఉందన్నారు.నాగార్జున సాగర్ వంటి మానవ నిర్మిత అద్భుత ప్రాజెక్టు నిర్మాణానికి 40 సంవత్సరాలు పట్టిందని,కానీ కాళేశ్వరం ప్రాజెక్టు 40 నెలల్లో పూర్తవుతున్నదని ఘంటా చెప్పారు. కాళేశ్వరం పనులు జరుగుతున్న తీరు, వేగం, ఇంజనీర్ల నైపుణ్యం ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయని ప్రొఫెసర్ చక్రపాణి తెలిపారు. తెలంగాణలోని ప్రతి పల్లెకు తాగునీరు, ప్రతి చెరువు,ప్రతి కుంటకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు గురించి మాటల్లో వర్ణించలేమని టి.ఎస్.పి.ఎస్.సి.చైర్మన్ అన్నారు. తెలంగాణ భవిష్యత్ చిత్రపటం రూపు రేఖలు సమస్తం మారబోతోన్నట్టు చక్రపాణి చెప్పారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన, మంత్రి హరీశ్ రావు పర్యవేక్షణతో ఇంజనీర్ల శ్రమ తెలంగాణ పునర్నిర్మానానికి ప్రాణం పోస్తున్నదని ఘంటా చక్రపాణి తెలిపారు.రీ డిజైన్, గోదావరి రివర్స్ పంపింగ్ విధానం అద్భుతమని అన్నారు. గోదావరి నీటిని 30 మీటర్ల కింది నుంచి పారే నీటిని కాళేశ్వరం ప్రాజెక్టు లో రివర్స్ పంపింగ్ ద్వారా హైదరాబాద్ వంటి ప్రాంతాలకు 140 మీటర్ల ఎత్తునకు పారించడం తమనుసంభ్రమాశ్చర్యాలకు గురి చేసిందని ప్రొఫెసర్ల బృందం అభిప్రాయ పడింది.

telangana profeser unite 1     telangana profeser unit 2     telangana profeser unit 3     telangana profeser unit 4

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *