బంగారు తెలంగాణకు బాటలు షురూ….

తెలంగాణలో మరో చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి కేసీఆర్. బంగారు తెలంగాణకు బాటలు షురూ అయ్యాయి. తెలంగాణ అభివృద్ధి పధంలో నడిపించేందుకు కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. పది జిల్లాల తెలంగాణ ఇప్పుడు 25 జిల్లాల తెలంగాణ కాబోతుంది. తెలంగాణ రాష్ట్ర్రంలోని 459 మండలాలు, 499 కి చేరుకోనున్నాయి. 42 రెవిన్యూ డివిజన్లు 60 డివిజన్లు అవుతున్నాయి. జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కొత్త జిల్లాలు, డివిజన్ల పై నోటిఫికేషన్ జారీ కానుంది. తెలంగాణ లో అతి ముఖ్యమైన పండుగ దసరా నుంచి కొత్త జిల్లాల పాలన ప్రారంభం కానుంది. దీంతో తెలంగాణ అభివృద్ధికి బంగారు బాటలు పడుతున్నాయి. ఈ నిర్ణయం పట్ల తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి విషయంలో చకా చకా నిర్ణయాలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు పలువురు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల కొత్తగా జిల్లాగా ఏర్పాటు కానుంది. రంగారెడ్డి జిల్లాలో వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో గద్వాల, నాగర్ కర్నూల్, మెదక్ జిల్లాలో సంగారెడ్డి, సిద్దిపేట కొత్త జిల్లాలుగా ఆవిర్భవించనున్నాయి. నిజాంబాద్ జిల్లాలో కామారెడ్డి, కరీంనగర్ జిల్లాలో జగిత్యాల, వరంగల్ జిల్లాలో భూపాలపల్లి, జనగామలు కొత్త జిల్లాలుగా ఏర్పాటు కానున్నాయి, అలాగే ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం, నల్గొండ జిల్లాలో సూర్యాపేట, యాదగిరిగుట్ట(యాదాద్రి), హైదరాబాద్ లో సికింద్రాబాద్ జిల్లాలుగా ఏర్పాటు అవుతాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.