ఫ్రాన్స్ లో అమర్ రహే అని నినదించిన మోడీ

ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న నరేంద్ర మోడీ అక్కడ భారత్ తరఫున యుద్ధంలో పాల్గొని అమరులు అయిన వారిని సందర్శించి నివాళులర్పించారు. మొదటి ప్రపంచ యుద్ధంలో భారత్ కు స్వాతంత్ర్యం రాకముందు 10వేల మంది భారత సైనికులు ఫ్రాన్స్ తరఫున యుద్ధంలో పాల్గొన్నారు. బ్రిటన్-ఫ్రాన్స్ కూటమిగా జరిగిన ఈ యుద్ధంలో అసవులు బాసిన యుద్ధవీరులకు ఫ్రాన్స్ లో ని లిల్లే లోని నువె ఛాపల్  యుద్ధ స్మారకాన్ని నిర్మించారు.

ఈ స్మారకాన్ని శనివారం సందర్శించిన మోడీ అక్కడ భారత్ కు చెందిన వారితో కలిసి అమర్ రహే అంటూ నినదించారు. అక్కడి సందర్శకుల పుస్తకంలో యుద్ధవీరులకు జేజేలు.. వందనం అంటూ రాశారు. ఇదంతా వర్షంలోనే సాగడం గమనార్హం. వర్షంలో నడుస్తున్న మోడీని చూసి అక్కడున్న భారతీయులు వందేమాతరం అని నినదిస్తే.. మోడీ గొంతు కలపడం విశేషం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *