Breaking News

ఫైనాన్స్ దందాలో తొలి వికెట్ పడింది..

KNKMDHI-W025_G5_HY_1639008e

ఫైనాన్స్ పేరు తో కొందరు కరీంనగర్, ఆదిలాబాద్ పోలీసు అధికారులు చేసిన దాష్టీకం బయటపడింది.. కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించేసి ఏఎస్సై మోహన్ రెడ్డి కేంద్రం వడ్డీ వ్యాపారం నిర్వహించారు. వీరి డబ్బులు తీసుకున్న క్రెన్ కెస్ట్ అధినేతపై బలవంతపు ఒత్తిడి తెచ్చి ఆయన ఆత్మహత్యకు కారకులయ్యారు. వారి ఫిర్యాదుతో మోహన్ రెడ్డి, ఆయన వెనుక ఉన్న ఏఎస్పీ, డీఎస్పీ, సీఐలు, ఎస్సైలు, పోలీసు అధికారుల బండారం బయటపడింది.

రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖకు మచ్చతెచ్చిన ఈ కేసును సీఐడీకి అప్పగించారు. కాగా మోహన్ రెడ్డి కి దాదాపు 90 లక్షల రూపాయలు ఫైనాన్స్ కు వడ్డీలకు ఇవ్వమని ఇచ్చిన కరీంనగర్ ఏఎస్పీ జనార్దన్ రెడ్డి డీజీపీ అనురాగ్ శర్మ బదిలీ చేసి డీజీపీకి అటాచ్ చేశారు. దీంతో ఈ ఫైనాన్స్ దందాలో తొలి వికెట్ పడింది.. ఏఎస్పీతో పాటు చాలా మంది సీఐలు, డీఎస్పీలు ఉన్నారు . వీరిపై కూడా శాఖపరమైన చర్యలు త్వరలో ఉంటాయి..

ఏఎస్పీ మోహన్ రెడ్డి వడ్డీలు ఇచ్చి తిరిగి చెల్లించిన. చెల్లించని వారి నుంచి వారి ఆస్తులను గుంజుకున్నాడు. దీనిపై వరుసగా బాధితులు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *