ఫైనల్ చేరాలంటే గెలవాల్సిందే..

-ఇంగ్లండ్ తో తదుపరి వన్డేలో ఇండియా గెలిచితీరాలి
సిడ్నీ: వర్షం రాకతో ఇండియా, ఆస్ట్రేలియా వన్డే రద్దయింది. ఈ మ్యాచ్ లో ఇండియా ఓడిపోతే గనుక సరాసరి ఇంటికే వెళ్లి ఉండేది. వర్షం ఓ రకంగా ఇండియా నెత్తిన పాలుపోసినట్టైంది. తదుపరి ఇంగ్లండ్ తో మ్యాచ్ డూ ఆర్ డై లా సాగనుంది. ఆ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ లో ఆస్ట్రేలియాతో ఫైనల్ లో తలపడుతుంది.

ముక్కోణపు సీరిస్ లో ఆస్ట్రేలియా -ఇండియా మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. 44 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందు బ్యాటింగ్ చేసిన ఇండియా  16 ఓవర్లలో 2 వికెట్లకు 69 పరుగులు చేసిన స్థితిలో ఉండగా భారీ వర్షం కురిసి మ్యాచ్ రద్దయింది. అప్పటికీ రహానే 28 పరుగులతో, కోహ్లీ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *