Breaking News

ఫేస్ బుక్ లో మంత్రి వార్త పెట్టినందుకు శిక్ష

allola-kallolam-news-1024x630

-మంత్రి వార్త ఫేస్ బుక్ లోడ్ ఆప్ లోడ్ చేసినందుకు యువకుడికి పోలీసులతో బెదిరింపులు

ఆదిలాబాద్, ప్రతినిధి : చెరువును కబ్జా చేశారంటూ ఇటీవల పత్రికల్లో వచ్చిన తెలంగాణ మంత్రి వార్త ను ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేసిన ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ యువకుడిపై పోలీసులు కేసుపెట్టారు. మంత్రి అల్లోల ప్రోద్బలంతో ఆయన అనుచరులు చేసిన ఫిర్యాదు మేరకు నిర్మల్ పోలీసులు యువకుడి కుటుంబాన్ని పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారించారు. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో యువకుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోగా అతడి కుటుంబాన్ని పోలీసులు హింసిస్తున్నారు..

మంత్రి పై వచ్చిన ఆరోపణలు నిరూపించుకోవాల్సింది పోయి ఏకంగా ఓ అమాయకుడిపై కేసు పెట్టడంపై పోలీసుల తీరును నెటిజన్లు విమర్శిస్తున్నారు. మహారాష్ట్రలో ఓ ఫేస్ బుక్ అప్ లోడ్ కేసులో ఏకంగా సుప్రీం కోర్టే తీర్పు ఇచ్చింది. వ్యక్తి భావ స్వేచ్ఛ ఎవరైనా ఫేస్ బుక్ లో ఏమైనా రాసుకోవచ్చని తెలిపిందని అలాంటింది యువకుడిపై ఎలా కేసుపెడతారని మండిపడుతున్నారు.

కాగా దీనిపై నిర్మల్ పోలీసులను విలేకరులు ప్రశ్నించగా.. పేపర్లలో వచ్చిన ఆరోపణలు నిజనిర్ధారణ చేసుకోకుండా ఫేస్ బుక్ లో పెట్టాడని.. అవి రుజువు కాలేదు కాబట్టి యువకుడిపై కేసు పెట్టి విచారిస్తున్నామని పోలీసులు మొండి వాదన తెరపైకి తెచ్చారు. మరి తెలంగాణ మంత్రి వార్త ఫేస్ బుక్ లో పెట్టడం తప్పా.. పోలీసుల వ్యవహార శైలిపై విమర్శలు వెలువడుతున్నాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *