ఫేస్ బుక్, ట్విట్టర్ లకు వార్నింగ్

 ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ ఫేస్ బుక్, ట్విట్టర్ లను టార్గెట్ చేసింది.  ఫేస్ బుక్, ట్విట్టర్ సీఈవోలు మార్క్ జుకర్ బర్గ్, జాక్ డోర్సీలను చంపేస్తామని ప్రకటించారు. అంతేకాదు.. పదివేల ట్విట్టర్, ఫేస్ బుక్ ఖాతాలను హ్యాక్ చేశామని.. 150 ఫేస్ బుక్ బృందాలు, ఐదు వేలకు పైగా ట్విట్టర్ ఖాతాలను హ్యాక్ చేసినట్టు చెప్పారు.. ఈ మేరకు 25 నిమిషాల నిడివిగల వీడియోను రూపొందించి విడుదల చేసింది ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ. అందులో మార్క్ జుకర్ బర్గ్, జాక్ డోర్సిల చిత్రపటాలను ఉంచి ఒక ఉగ్రవాది కాలుస్తున్నాడు. ఈ భయానక సంస్థ ఫేస్ బుక్, ట్విట్టర్ లపై పడడం.. ఆ సంస్థల అధినేతలను చంపుతామనడంతో అమెరికా అలెర్ట్ అయ్యింది. వారి రక్షణ కల్పించేందుకు చర్యలు చేపట్టింది..

ఫేస్ బుక్, ట్విట్టర్ సైతం ఐఎస్ఐఎస్ కు వ్యతిరేకంగా చర్యలు ఇప్పటికే చేపట్టాయి. ఉగ్రవాదుల ఖాతాలను నిలుపుదల చేశాయి. వారి వీడియోలను , ప్రచారాలకు వాడే అకౌంట్లను నిలుపుదల చేసి ఉగ్రవాద విస్తరణను అడ్డుకట్టవేశాయి. దీనికి ఆగ్రహంగానే ఐఎస్ఐఎస్ తీవ్రవాద సంస్థ ఫేస్ బుక్, ట్విట్టర్ లపై యుద్ధం ప్రకటించాయి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *