ఫేక్ కరెన్సీ గుట్టు రట్టు…

ఫేక్ కరెన్సీ.. పేరుకేమో ఇంజినీరింగ్ చదువులు… చేసేది చట్ట వ్యతిరేక గణకార్యలు.. కొంత మంది కేటుగాళ్లతో దోస్తీ కట్టి ఫేక్ కరెన్సీ ముఠా కు తెరలేపారు. చివరికి పోలీసుల కంట పడి ఊచలు లెక్కిస్తున్నారు… పై చదువులు చదివి పేరెంట్స్ ని హాప్యి గా ఉంచుతారనుకున్న యూత్ తల్లి దండ్రుల పరువు తీస్తున్నారు.. పేరుకేమో ఇంజనీరింగ్ చదువుతూ.. ఫేక్ నోట్ల మాఫియా కు స్కెచ్ వేశారు.. కొంత మంది ముఠా సభ్యులతో దోస్తీ కుదుర్చుకున్నారు… ఇంజినీరింగ్ తెలివిని కాస్త ఫేక్ కరెన్సీ వైపు మళ్లించారు..పెద్ద నోట్ల రద్దు తో మార్కెట్ లోకి వచ్చిన కలర్ ఫుల్ నోట్లను మార్పిడి చేయడం మొదలు పెట్టారు.. చివరికి వీరి బాగోతం బైట పడటం తో పోలీస్ లకు చిక్కారు… రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ హిమాయత్ సాగర్ లార్డ్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న వహిదుద్దీన్,లింగంపల్లి వాసి, మరో విద్యార్ధి సమద్ బర్కత్ పుర వాసి వీరిద్దరూ కొంత మంది తో కలిసి నకిలీ కరెన్సీ ప్రింట్ చేస్తూ పట్టు బడ్డారు.. లార్డ్ ఇంజినీరింగ్ కాలేజీ క్యాంటీన్ లో వీరిద్దరూ ఎస్ఒటి పోలిస్ లకు చిక్కారు.. తీగ లాగితే డొంక కదిలినట్టు ఫేక్ కరెన్సీ గ్యాంగ్ వివరాలు వెలుగు చూశాయి.. హిమాయత్ సాగర్ లోని లార్డ్ కాలేజ్ కేంద్రంగా నోట్ల మార్పిడి కొనసాగిస్తున్నారు.. బర్కత్ పురాకు చెందిన ఆర్షద్ అలీ …సుటెండ్ వహిదుద్దీన్ బాబాయ్, మరికొంత మంది తో కలిసి ఫేక్ నోట్లను ప్రింట్ చేసి సరఫరా చేస్తున్నారు.. విషయం తెలుసుకున్న స్పెషల్ ఆపేరేషన్ టీం పోలీస్ లు ముఠా కు చెక్ పెట్టారు. క్యాంటిన్ లో నఖిలీ కరెన్సీ చలామని చేస్తున్న ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులతో సహ నలుగురిని ఆరేస్ట్ చేసి ఎస్ఒటి పోలీసులు. 36 లక్షల 2000 నోట్ల నఖిలీ కరెన్సీ కలర్ ప్రింటర్, నాలుగు సెల్ ఫోన్లు స్వాదీనం చేసుకుని రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు. పట్టు బడ్డ ముఠా సభ్యుల్లో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు ఉండడం తో కేస్ నీ స్ట్రాంగ్ గా టేక్ అప్ చేస్తున్నారు పోలీస్ లు.. ఇంకెవరైనా విద్యార్థులు సదరు గ్యాంగ్ తో లింక్స్ ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీస్ లు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *