ఫూలే విదేశీ విద్య ద‌ర‌ఖాస్తు గ‌డువు పెంపు:బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామ‌న్న‌

ఫూలే విదేశీ విద్య ద‌ర‌ఖాస్తు గ‌డువు పెంపు:బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామ‌న్న‌

ఫూలే విదేశీ విద్య ద‌ర‌ఖాస్తు గ‌డువు పెంపు

ఈనెల 15 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామ‌న్న‌

హైద‌రాబాద్‌, ఫిబ్ర‌వ‌రి 2 : బీసీ వ‌ర్గాలకు చెందిన‌ విద్యార్థులు విదేశాల్లో ఉన్న‌త‌ విద్య‌ను అభ్య‌సించేందుకు ఉద్దేశించిన మ‌హాత్మా జ్యోతిబా ఫూలే విదేశీ విద్య నిధి ద‌ర‌ఖాస్తు గ‌డువును ఈనెల 15 వ తేదీ వ‌ర‌కు పొడ‌గించిన‌ట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామ‌న్న తెలిపారు. ఈ అవ‌కాశాన్ని బీసీ విద్యార్థులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఆయ‌న కోరారు. వాస్త‌వానికి విదేశీ విద్య నిధి ద‌ర‌ఖాస్తు చేసుకునే గ‌డువు జ‌న‌వ‌రి 31వ తేదీతో ముగిసింద‌ని, కాని వివిధ వ‌ర్గాల నుంచి వ‌చ్చిన విజ్ఞ‌ప్తుల మేర‌కు ఈ గ‌డువును ఈనెల 15వ తేదీ వ‌ర‌కు పొడ‌గించిన‌ట్లు మంత్రి జోగు రామ‌న్న ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. మ‌రిన్ని వివ‌రాల కోసం జిల్లా, డివిజ‌న్ బీసీ సంక్షేమ అభివృద్ధి అధికారుల‌ను సంప్ర‌దించాల‌న్నారు. బీసీ అభ్య‌ర్థులు ఈపాస్ వెబ్‌సైట్‌లో హెచ్‌టీపీపీ //తెలంగాణ ఈపాస్ సీజీజీ.జీవోవీ.ఇన్ ద్వారా ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు చేసుకోవ‌చ్చ‌ని ఆయ‌న సూచించారు. బీసీ వ‌ర్గాల కోసం ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌త్యేకంగా ఫూలే పేరిట విదేశీ విద్య నిధి ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్నార‌ని మంత్రి జోగు రామ‌న్న తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *