Breaking News

ఫీజులు వేళల్లో.. సౌకర్యాలు అథపాతాళంలో.. ప్రాణాలు గాలిలో..

11

ప్రైవేటు పాఠశాలలు.. ఫీజుల పేరుతో తల్లిదండ్రులు రక్తం తాగుతున్నాయి. స్కూళ్లలో కనీస సౌకర్యాలు లేకున్నా వేలల్లో ఫీజులు తీసుకుంటూ దోచుకుంటున్నాయి. ప్రభుత్వం, అధికారులకు మామూళ్లు ఇఛ్చి మేనేజ్ చేస్తూ తప్పులను కప్పిపుచ్చుకుంటున్నాయి. ప్రభుత్వం ఆర్భాటంగా అన్న కేజీ 2 పీజీ ఉచిత విద్య అమలైతే కానీ తల్లిదండ్రుల కష్టాలు తీరేలా లేవు..

చిన్నారి చదువుతున్న పాఠశాల ఇదే..

చిన్నారి చదువుతున్న పాఠశాల ఇదే..

నిన్న హైదరాబాద్ లో ఘోరం జరిగింది. శ్రీ చైతన్య స్కూల్ లో లిఫ్ట్ లో ఇరుక్కొని ఓ చిన్నారి ఫాతిమా జాఫ్రీ (4) మృత్యువాతపడింది. పిల్లలు లిఫ్ట్ లోకి ఎక్కుతుండగా వారితో పాటు ఉపాధ్యాయులు ఎక్కారు. కానీ లిఫ్ట్ లోని గ్రిల్ సరిగ్గా పనిచేయడం లేదు. మొదటి అంతస్థులోకి చేరాక జాఫ్రీ తన బ్యాగ్ కోసం పక్కకు జరగగా గ్రిల్ ఊడిపోయి లిఫ్ట్ కు, గోడకు మధ్యలో ఇరుక్కపోయాడు.. దీంతో 20 నిమిషాలు నరకయాతన పడి మృతిచెండాడు. గోడకు, లిఫ్ట్ కు మధ్య ఖాళీ ప్రదేశంలో తల ఇరుక్కుపోవడం తీసే దారి లేక పోలీసులు వచ్చిలిఫ్ట్ను పైకి తీసుకుపోయి మృతదేహాన్ని తీశారు.

కాగా పాఠశాలలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయురాలిని, యజమానికి పోలీసులు అరెస్ట్ చేశారు.  పాఠశాలను సీజ్ చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *