
మహబూబ్ నగర్ : ఆన్ లైన్ మోసం మరోసారి వెలుగుచూసింది.. మహబూబ్ నగర్ జిల్లాలో ఒక వ్యక్తి ఆన్ లైన్లో వాటర్ ఫిల్టర్ బుక్ చేశాడు. రూ.8వేలు పెట్టి వాటర్ ఫిల్టర్ ఆర్డర్ ఇవ్వగా ఇవాళ కొరియర్ బాయ్ వచ్చి పార్సిల్ ఇచ్చాడు.. ఇంటికెళ్లిన మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోటలోని వినియోగదారుడు చూసి అవాక్కయ్యాడు..
ఎందుకంటే ఆ బాక్స్ లో విప్పి చూస్తే వాటర్ ఫిల్టర్ కు బదులు ఇటుక వచ్చింది. ఇటుక ఆ డబ్బాలో ఉండడం చూసి ఆ వినియోగదారుడు అవాక్కయి బోరు మన్నాడట.. స్నాప్ డీల్ ద్వారా వచ్చిన ఈ బాక్స్ ను చూసి ఆన్ లైన్ లో మోసం జరిగిందని బాధితుడు బోరుమన్నాడు.. ఈ మోసం ఆన్ లైన్ ద్వారా జరిగిందా..? కొరియర్ సంస్థ ద్వారా జరిగిందా అన్న తేలాల్సి ఉంది..